దశాబ్దానికి పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత భర్తకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతుండగా గౌతమ్ కిచ్లు వ్యాపారాలతో బిజీ అవుతున్నారు.
గతేడాది అక్టోబర్ నెల 30వ తేదీన కాజల్ గౌతమ్ కిచ్లు వివాహం ఘనంగా జరిగింది.
కరోనా నిబంధనల దృష్ట్యా తక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా భర్త గురించి కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాజాగా కాజల్ భర్త బహుమతిగా ఇచ్చిన ఐదు చాక్లెట్లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే భర్త తనపై ప్రేమతో చాక్లెట్లు ఇవ్వలేదని గౌతమ్ ఈ చాక్లెట్లు ఇవ్వడానికి ముఖ్యమైన కారణమే ఉందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.
పెళ్లి తరువాత బిజినెస్ వ్యవహారాలతో బిజీ అయిన గౌతమ్ కిచ్లు కాజల్ అగర్వాల్ తో తగినంత సమయం గడపలేకపోతున్నారు.
ఆ కారణం వల్ల కాజల్ కు ఎంతో ఇష్టమైన చాక్లెట్లను గౌతమ్ కిచ్లు బహుమతిగా ఇచ్చారు.భర్త తనతో తగినంత సమయం గడపకపోవడం వల్లే చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారని.
భర్త ప్రేమతో ఇచ్చిన ఈ చాక్లెట్ల వల్ల తన డైట్ కూడా నాశనం అవుతోందని ఆమె పేర్కొన్నారు.

ఆ తరువాత ఏ చాక్లెట్ ముందుగా తినేశానని అనుకుంటున్నారో చెప్పాలని అభిమానులను కాజల్ అగర్వాల్ కోరారు.కాజల్ అగర్వాల్ సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఉండగా ఆమె భర్త కూడా అప్పుడప్పుడూ కాజల్ తో పాటు షూటింగ్ లకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.2021లో కాజల్ నటించిన లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ ఫ్లాప్ కాగా ఆమె నటించిన మోసగాళ్లు సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.