ఏపీ అంతటా ఇప్పుడు పోస్టర్లు ఉద్యమం నడుస్తుంది. వైసీపీ , టీడీపీ , జనసేనల మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది.
ఇప్పటికే ఉదృతంగా అధికార పార్టీ వైసీపీ పోస్టర్లను అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో వైసిపి స్టిక్కర్లు అంటిస్తుండగా, టిడిపి జనసేన కూడా వైసిపిని విమర్శిస్తూ , తమ పార్టీ నినాదాల స్టిక్కర్లను అంటిస్తున్నాయి.
ఈ వ్యవహారం ఈ విధంగా కొనసాగుతుండగానే .ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో మరో పోస్టర్ వార్ మొదలైంది.అధికార పార్టీ వైసిపి ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు వెలిశాయి.పట్టణమంతా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి .అది కూడా మోసపోయిన వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అంటూ ఈ పోస్టర్లు అనేక ప్రాంతాల్లో అంటించారు.

మా నమ్మకం నువ్వే జగన్ అన్న కానీ ” రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డీ( Meda mallikarjuna Reddy) నీ మీద మాకు నమ్మకం లేదు ” ఇట్లు మోసపోయిన వైఎస్సార్ సీపీ నాయకులు మరియు కార్యకర్తలు అంటూ పట్టణమంతా పోస్టర్లు వెలిశాయి.ముఖ్యంగా రాజంపేట పట్నంలోని ప్రధాని కుడాళన బండ్రాళ్ల వీధి, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, పట్నంలోని విద్యుత్ స్తంభాలకు, గోడలకు ఈ పోస్టర్లు వెలిశాయి.ఈ పోస్టర్లు కూడా ఎమ్మెల్యే వల్ల మోసపోయిన, నష్టపోయిన కార్యకర్తల పేరుతో ఉండడం అధికార పార్టీ వైసీపీలో( YCP ) కలకలం రేపుతోంది.

అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు ? ఎందుకు వేసారు అనేది చర్చనీయాంశం గా మారింది.రాజంపేట వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ల( Akepati AmarNath Reddy )కు మధ్య ఆధిపత్య పోరు ఉంది.

అనేక సమావేశాల్లో వీరిరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.ఇప్పుడు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలువడడంతో ఇదంతా అకేపాటి అమర్నాథ్ రెడ్డి వెనకుండి చేయించారు అనే అనుమానాలు ఎమ్మెల్యే వర్గంలో కనిపిస్తోంది.







