పెళ్లిళ్లు,శుభ కార్యాలపై కూడా నిషేధం

ఎక్కడ విన్నా కరోనా పేరే వినిపిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా ప్రభావం తో ప్రపంచ దేశాలు మొత్తం ట్రావెల్ బ్యాన్స్ కూడా విధిస్తున్నాయి.

మరోపక్క భారత్ లో కూడా ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడం తో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ కూడా ఢిల్లీ లోని అన్ని క్లబ్ లు ,జిమ్ లతో పాటు స్పాలు అన్ని కూడా మార్చి 31 వరకు మూసి ఉంచాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా పెళ్లిళ్లు,ఇతరత్రా శుభ కార్యాలను కూడా ఈ నెల 31 వరకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.వీటితో పాటు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలపై కూడా నిషేధం విధిస్తున్నామని, ఒకే చోట 50 మంది కంటే ఎక్కువ గుమిగూడటంపై కూడా నిషేధం విధిస్తున్నామని ఆయన ప్రకటించారు.

అలానే మరోపక్క ఆటో రిక్షాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేజ్రీ వాల్ తెలిపారు.మెట్రో స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఆయన వివరించారు.

Advertisement

ఒకవేళ కరోనా వైరస్ సోకిన వారిని క్వారంటైన్ కోసం లెమన్ ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబీఐఎస్ హోటళ్లలో అన్ని ఏర్పాటు చేశామని, ఆసుపత్రుల్లో కూడా అన్ని వసతులను సమకూర్చినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.మొత్తానికి ఈ కరోనా ప్రభావం తో రాష్ట్రాలు అన్ని కూడా అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.

ఇటు తెలుగు రాష్ట్రం తెలంగాణా లో కూడా అన్ని మాల్స్,సినిమా హాల్స్,స్కూల్స్ అన్నిటిని కూడా ఈనెల 31 వరకు మూసివేస్తున్నట్లు అక్కడి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.సినిమా హాల్స్ తో పాటు సినిమా షూటింగ్ లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది.కరోనా ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు