పార్టీ మారే విషయంలో క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

విశాఖ జిల్లాలో కీలక నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొంతకాలంగా వార్తలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి.

ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనతో పాటు సుమారు పదిమంది వరకు ఎమ్యెల్యేలను వెంటబెట్టుకెళ్ళబోతున్నారు అంటూ కథనాలు జోరందుకున్నాయి.

ఈ వార్తలను గంటా శ్రీనివాసరావు కూడా ఖండించలేదు సరికదా తాను పార్టీ మారుతున్నాను, మారడం లేదు అనే విషయం ఏదీ క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ వార్తలు పెద్ద ఎత్తున వస్తుండడం టీడీపీ నేతలంతా అనుమానాస్పదంగా చూస్తుండడంతో ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు మౌనం వీడారు.

అసలు తాను పార్టీ మారడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు, వార్డుల విభజన జరిగాక సమర్ధులైన వారిని నియమిస్తామని గంటా తెలిపారు.

దీంతో గంటా పార్టీ మారడం లేదు అనే క్లారిటీ వచ్చేసింది.ఇక గంటా బీజేపీలోకి వెళ్తారనే వార్తలు వచ్చినా ఆయన మనసంతా వైసీపీని ఉందని, అక్కడకు వెళ్లేందుకు గంటా మంతనాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఆయన రాకను మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డుకున్నట్టుగా ప్రచారం జరిగింది.ఏదైతేనేమి నేను టీడీపీలోనే ఉంటాను వేరే పార్టీలోకి వెళ్లబోను అనే విషయాన్ని ఆయన క్లారిటీ గా చెప్పెయ్యడంతో ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠ కు తెరపడింది.

అయితే రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయనేది చెప్పలేదు.ఆయనకు సరైన ఆఫర్ దొరికితే పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు