సీఎం జగన్ స్పీచ్ పై గంటా శ్రీనివాసరావు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.విపక్ష పార్టీ తెలుగుదేశం 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

 Ganta Srinivasa Rao Serious Comments On Cm Jagan Speech , Ap Cm Jagan, Ganta Sri-TeluguStop.com

ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటూ ఈ ఐదు సంవత్సరాలలో వైసీపీ పాలనపై మండిపడుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో “రా కదలిరా” అనే సభలు నిర్వహిస్తున్నారు.

ఈ సభలలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించాలి అన్నదానిపై నాయకులకు కీలక సూచనలు చేస్తూ ప్రజలకు పలు హామీలు ప్రకటిస్తున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Former minister Ganta Srinivasa Rao ) సీఎం జగన్ పై ట్విట్టర్ లో సీరియస్ పోస్ట్ పెట్టడం జరిగింది.కొద్ది రోజుల క్రితం “సిద్ధం” అనే పేరుతో భీమిలి నియోజకవర్గంలో వైయస్ జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సభలో అర్జునుడు అంటూ జగన్ సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.ఈ స్పీచ్ పై తాజాగా గంటా శ్రీనివాసరావు సీరియస్ పోస్ట్ పెట్టడం జరిగింది.“నీకున్న అజ్ఞానానికి పురాణ పురుషుల గురించి మాట్లాడటం ఎందుకులే జగన్.అర్జునుడు అంటే నీలాగా రాక్షసుడేమో అనుకుంటున్నట్టు ఉన్నావు.కాదు కాదు… అతను ధర్మం వైపు నిలబడి యుద్ధం చేసినవాడు.ధర్మాన్ని గెలిపించినవాడు”.అని పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube