జగన్ రెడ్డి పార్టీకి నూకలు చెళ్లిపోయాయి.. గంటా శ్రీనివాసరావు

జగన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) పార్టీకి నూకలు చెళ్లిపోయాయి అని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుండో ముఖ్యమంత్రి పర్యటన గురించి ఊరిస్తున్నారు.గాలిలోనే వచ్చారు గాలిలోనే వెళ్లారు అని ఎద్దేవా చేశారు ఒక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తే వివిధ రాజకీయ పార్టీల వారికి, ప్రజాసంఘాల వారికి సమయం కేటాయిస్తారు.

 Ganta Srinivasa Rao Comments On , Ys Jagan Mohan Reddy , Vijaysai Reddy , Ganta-TeluguStop.com

కానీ ఆ తరహా పద్ధతులకు తిలోదకాలు ఇచ్చారు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం కూడా అందించాం.కానీ అది బుట్టదాఖలు అయింది ముఖ్యమంత్రి ప్రవర్తన విడ్డురంగా ఉంది.

కేవలం వైసీపీ ముచ్చట మూడు నెలలే కనీసం ఇప్పటికైనా సీఎం వాస్తవాలు మాట్లాడాలి.దసరాకు కాదు క్రిస్మస్ కి విశాఖలో మకాం అంటున్నారు అది కాస్త సంక్రాంతికి వెళ్లడం కాయం అనుభవమున్న రాజకీయనాయకులు వైసీపీ లో ఎందరో ఉన్నారు.

వారిని చూస్తే జాలేస్తుంది సీఎం చెప్పిన గొప్పలు గత ప్రభుత్వాల హయాంలో వచ్చినవే వాటిని జగన్ రెడ్డి తెచ్చినట్టు గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు.కొత్త వాటి మాట పక్కన పెడితే ఉన్నవాటినే కాపాడుకోలేని పరిస్థితిలో జగన్ సర్కార్ ఉందిఒక్కో ప్రాంతానికి ఒక్కో సామంతరాజుని నియమించి ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తూ ముందుకు వెళ్తున్న జగన్ రెడ్డి పార్టీకి నూకలు చెల్లిపోయాయి భీమిలి చుట్టుప్రక్కల ప్రాంతంలో విజయసాయి రెడ్డి( Vijaysai Reddy ) ఇంచార్జ్ గా ఉన్న సమయంలో సుమారు 2లక్షల గజాలు కాజేశారు ఉత్తరాంధ్రపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఈ ప్రాంతాన్ని ద్వేషిస్తున్నారుమాజి మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఇవ్వాళ జగన్ ఇంకో కుంభకోణానికి పాల్పడ్డారు.

పరవాడ లో రెండు రిజర్వాయర్ లో కుంభకోణానికి పాల్పడ్డారు ఒక రిజర్వాయర్ దొడ్డి దారిలో విజయసాయి రెడ్డి బంధువు కు అప్పగించారు ఫార్మలో తాడి తరలింపు లో అన్యాయం చేస్తున్నారు.

తాడి గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సీఎం జిల్లా కు వచ్చి ఒక్క ఎమ్మెల్యే కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.ప్రధాని మంత్రులు సైతం విశాఖ వస్తే ప్రతి పక్షాలకు సమయం ఇచ్చి సమస్యలు వినేవారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చారు ఈ సీఎం జగన్ హెలి టూర్ మాత్రమే చేశారు తప్ప ఇంకేమి చెయ్యలేదు.మతి భ్రమించిన ముఖ్య మంత్రి పుస్తకం పట్టుకుని దసరా మాములు కు వచ్చారు అని అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చారు, హెలికాప్టర్ లో వెళ్లారు ఎందుకు ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేశారువిశాఖ లో సీఎం పైన హెలికాప్టర్ లో వస్తే కింద ట్రాఫిక్ ఆపేస్తున్నారు ఇదేమి ఘోరం.

జులై వస్తాను అన్నారు సెప్టెంబర్, అక్టోబర్ అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు.మళ్ళీ వాయిదా వేస్తున్నారు అసలు సీఎం వస్తారా ఋషికొండలో నిర్మాణం సీఎం ఆఫీస్ , సీఎం క్యాంప్ ఆఫీస్ నా చెప్పాలి.

కోటి రూపాయలు ఖర్చు చేయాలా రుషి కొండ అంటే బ్లూ ఫాగ్ బీచ్ పర్యావరణ విఘాతం కలిగించకూడదు.సీఎం జగన్ విశాఖ ను ఒక వ్యాపార కేంద్రం గా ఆలోచిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ కార్మికులకు అపోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని అన్నారు సమావేశంలో అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ద నాగ జగదీశ్వరరావు ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు వేపాడ చిరంజీవి రావు శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు పి వి జి కుమార్ బత్తుల తాతయ్య బాబు కోరాడ రాజబాబు ప్రగడ నాగేశ్వరరావు చిక్కాల విజయబాబు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలుఅనంత లక్ష్మి పార్లమెంట్ కార్యదర్శి గణగళ్ళ సత్య పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube