మాజీ మంత్రి, టీడీపీ కీలక నాయకుడు గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు తన రాజకీయంపై క్లారిటీ ఇచ్చారా? ఇప్పటి వరకు ఉన్న తర్జన భర్జనకు ఆయన తెరదించారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. టీడీపీలో గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో గత 20 నెలలుగా ఆయన మౌనంగా ఉండిపోయారు.
అంతేకాదు పార్టీ అదినేత చంద్రబాబుకు కూడా దూరంగా ఉంటున్నారు.ఏ కార్యక్రమాన్నీ ఆయన నిర్వహించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే కథనాలు వచ్చాయి.
అయితే అప్పట్లో అడపా దడపావాటిని కండిస్తూ వచ్చిన గంటా శ్రీనివాసరావువైసీపీలోకి వెళ్లే విషయంలో దోబూచులాడుతూనే ఉన్నారు.
ఇక, ఇప్పుడు విశాఖ ఉక్కు విషయం తెరమీదకి రాగానే తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని ఆయన కనీసం పార్టీ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ కీలక నేతలకు కానీ చెప్పలేదు.
ఇదే సమయంలో వారు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం. విశాఖ ఉక్కు కోసమే తను రాజీనామా చేశానని చెప్పినప్పటికీ లోలోపల ఏదో ఉందనే ఊహాగానాలు వినిపించాయి.
అయితే తాజాగా జరిగిన పరిణామంతో ఇక, గంటా వారు ఫ్యాన్ కిందకు చేరుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ సీనియర్ నాయకుడు పల్లా శ్రీనివాసరావుఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
దీనికి టీడీపీలోని నాయకులు మద్దతు తెలిపారు.మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వంటివారు వెళ్లి సంఘీభావంగా దీక్షలోనూ కూర్చున్నారు.
అయితే ఏ ఉక్కు కోసం రాజీనామా చేశార అదే ఉక్కు కోసం సొంత పార్టీ నాయకుడు దీక్ష కు దిగితే.గంటా శ్రీనివాసరావు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
కనీసం ఆయన ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదు.సొంత పార్టీ నాయకుడు చేస్తున్న దీక్షకు కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు.

పైగా.వైసీపీ నాయకులు చేపట్టిన బహిరంగ సభకుల, కార్మికుల నిరసనకు గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు కనుసన్నల్లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాదు ఇద్దరు నాయకులు ఒకే వేదిక పంచుకున్నారు.ఈ పరిణామాలను గమనించిన వారు ఇక, గంటా క్లారిటీ ఇచ్చారని, త్వరలోనే వైసీపీలోకి చేరిపోవడం ఖాయమని అంటున్నారు.మరోవైపు అవంతి కూడా నిన్న మొన్నటి వరకు గంటాను వ్యతిరేకించినా ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో సర్దుబాటు ధోరణిలోనే ఉన్నట్టు సమాచారం.
దీనిని బట్టి.టీడీపీకి బై చెప్పడం ఖాయమనే అంటున్నారు గంటా అనుచరులు కూడాఇక, ఈ విషయాన్ని టీడీపీ కూడా లైట్ తీసుకోవడం గమనార్హం.