ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జోరుగా సాగుతోంది.ఈ పాదయాత్ర మీద బురద చల్లడానికి టిడిపి వేయని ఎత్తుగడ అంటూ ఏదీ లేదు.
వైసీపి వర్గం ఎమ్మెల్యేలతో ఒక పక్క రాజీనామలు చేయిస్తూ.వైసీపి కీలక నేతలకి వలలు వేస్తూ టిడిపి.
జగన్ జోరుకు బ్రేకులు వేయడానికి విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది.అయితే ప్రజలు మాత్రం టిడిపి చేస్తున్న ప్రతీ అంశాన్ని చాలా సున్నితంగా గమనిస్తూనే ఉన్నారు.
ఇదే సమయంలో నంది అవార్డుల గొడవ రచ్చ రచ్చ అయ్యింది.గొడవలు సద్దు మనిగాయి కదా అనుకుంటే పుత్రుడి రూపంలో నంది రచ్చ మళ్ళీ రచ్చ రచ్చ అయ్యింది.
పోసాని కాస్తా టిడిపిని తెలంగాణా రోడ్డు మీదకి లాగినంత పని చేశాడు.ఇలా ఉంటే ఇప్పుడు మరొక భారీ షాక్ చంద్రబాబుకి తగిలింది
ఒకపక్క అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి.
ప్రతిపక్షం లేకపోయినా మనమే ప్రతిపక్షం లా వ్యవహరిద్దాం ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాలు తీరుద్దాం అంటూ చంద్రబాబు స్పీచ్ ల మీద స్పీచ్లు ఇస్తుంటే నిజమే కాబోలు అనుకున్న టిడిపి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ ప్రజలు కోరికని తమ ముఖ్యమంత్రి వద్ద మొరపెట్టుకుందాం అని వెళ్తే అక్కడ సదరు ఎమ్మెల్యేకి అవమానం జరిగింది.అంతే ఎమ్మెల్యే వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం అయ్యి చంద్రబాబు కి భారీ షాక్ ఇచ్చారు.
అసలు విషయం ఏమి జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి
డెల్టా షుగర్స్ ను హనుమాన్ జంక్షన్ నుంచి తణుకు ప్రాంతానికి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది…అయితే తన నియోజకవర్గం నుంచి డెల్టా షుగర్స్‌ను తరలించవద్దని, ఇక్కడ ప్రజలు అనేకమంది రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయంట…వల్లభనేని వంశీ ఈరోజు కొంతమంది రైతులతో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వెళ్లారు.అక్కడ సీఎంవో లో ఉండే ఒక అధికారి అడ్డుపడి సర్ బిజీ గా ఉన్నారు నాకు విషయం చెప్పండి సీఎం ని కలవడం కుదరదు అని మాట్లాడటం వంశీ చాలా సీరియస్ గా తీసుకున్నారు.
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు
ఈ తతంగం అంతా మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో.కంగారుపడిన లోకేష్ వంశీని సముదాయించే భాద్యత కళా వెంకట్రావుకి అప్పగించారు.
వంశీ తన రాజీనామా లేఖతో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ విషయాన్ని గమనించిన టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్.వంశీ వద్ద రాజీనామా లేక తీసుకుని చించేశారు.
ఏది ఏమైనా వంశీ రాజీనామాకే సిద్దపదినట్లుగా తెలుస్తోంది.ఒక పక్క టిడిపి జగన్ కి షాక్ ఇవ్వాలని చూస్తుంటే.
టిడిపికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే షాకుల మీద షాకులు ఇస్తున్నారు.







