సాధారణంగా ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ అనంతరం ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు.ఇలా ఒకటి రెండు హిట్ సినిమాలలో సందడి చేస్తున్న కొందరు హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.
అలాంటి వారిలో అల్లు అర్జున్ హీరోయిన్ అదితి అగర్వాల్ ఒకరని చెప్పాలి.అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
మొదటి సినిమాతోనే విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న అదితి అగర్వాల్ స్వయాన ఆర్తి అగర్వాల్ సోదరి అనే విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా తర్వాత అదితి అగర్వాల్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.
గంగోత్రి సినిమా తర్వాత ఈమె నటించిన ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్థి, కొడుకు సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు ఇలా ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అదే సమయంలోనే ఆర్తి అగర్వాల్ ప్రేమ పెళ్లి అంటూ ఈమె కెరియర్ కూడా డౌన్ ఫాల్ కావడంతో అదితి అగర్వాల్ సైతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అదితి అగర్వాల్ చివరి ప్రయత్నంగా 2016 లో లవ్ హాయ్ యార్ అక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించింది.ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో తాను నిలబడలేకపోవడంతో ఏకంగా తన ఫ్యామిలీతో కలిసి ఈమె ఫారిన్ వెళ్ళిపోయారు.ఇలా కుటుంబంతో కలిసి విదేశాలలో సెటిల్ అయినా ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నప్పటికీ ఎలాంటి సినిమాలను చేయలేదు అయితే సినిమాలలో నటించకపోయినా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు.ఇలా ఈమె ఫోటోలు చూసిన నెటిజన్స్ అదితి అగర్వాల్ ఏంటి ఇలా తయారయ్యారు అంటూ షాక్ అవుతున్నారు.