సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో ఎంతోమంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెలెబ్రిటీలుగా మారారు.ఇలా ఓ చిన్న పల్లెటూరిలో కూలి పనులు చేసుకుంటూ ఉండడానికి కూడా సరైన ఇల్లు లేనటువంటి పరిస్థితి నుంచి నేడు ఒక స్టార్ సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్న వారిలో గంగవ్వ ఒకరు.
ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తమ బంధువుల సహాయంతో తనకు సంబంధించిన విషయాలను పల్లెటూరి జీవనం గురించి అన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ విధంగా గంగవ్వ పల్లెటూరు వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈమెకు అతి తక్కువ సమయంలోనే ఎక్కువమంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవడంతో గంగవ్వ సెలబ్రిటీగా మారిపోయారు.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వకు బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా అవకాశం వచ్చింది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈమె అనారోగ్య సమస్యలతో మధ్యలోనే బయటకు వచ్చారు.
అయితే బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బుతో గంగవ్వ సొంత ఇంటిని కూడా నిర్మించకున్నారు.
ఇలా ఒకవైపు తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.ఇలా పల్లెటూరిలో కూలి పనులు చేసుకుంటున్నటువంటి ఈ గంగవ్వ సెలబ్రిటీగా మారి నెలకు భారీగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.ఈమె యూట్యూబ్ ఛానల్ పనులు చేసే వారికి ఖర్చులు పోను ఈమె నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఒక సినిమాలో గంగవ్వ ఒక రోజు షూటింగ్ కు వెళితే పదివేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారట.ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఎంతో చలాకిగా ఉంటూ ఇలా సోషల్ మీడియాని ఉపయోగించుకొని భారీగా సంపాదించడం విశేషం.