ఏలూరు జిల్లా( Eluru )లో కొవ్వూరు – రాజమండ్రి మధ్య నిర్మించిన గామన్ బ్రిడ్జ్ బేరింగ్ స్వల్పంగా కుంగింది.బేరింగ్ దెబ్బతినడంతో బ్రిడ్జ్ కుంగినట్లు తెలుస్తోంది.
వంతెన 53వ పోల్ వద్ద బేరింగ్ దెబ్బతింది.దీంతో స్వల్పంగా వంతెన కుంగింది.
గామన్ బ్రిడ్జ్( Gammon bridge ) లోపాన్ని గుర్తించిన బ్రిడ్జ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ పై రాకపోకలను దారి మళ్లించారు.
అదేవిధంగా బ్రిడ్జ్ ఎడమవైపు వాహనాలను పూర్తిగా నియంత్రించారు.అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ అండ బీ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కాగా కొవ్వూరు – రాజమండ్రి మధ్య 2007 లో ఈ బ్రిడ్జి నిర్మితమైంది.
తాజా వార్తలు