Eluru Gammon Bridge : ఏలూరులో దెబ్బతిన్న గామన్ బ్రిడ్జ్ బేరింగ్.. వాహనాలు దారి మళ్లింపు
TeluguStop.com
ఏలూరు జిల్లా( Eluru )లో కొవ్వూరు - రాజమండ్రి మధ్య నిర్మించిన గామన్ బ్రిడ్జ్ బేరింగ్ స్వల్పంగా కుంగింది.
బేరింగ్ దెబ్బతినడంతో బ్రిడ్జ్ కుంగినట్లు తెలుస్తోంది.వంతెన 53వ పోల్ వద్ద బేరింగ్ దెబ్బతింది.
దీంతో స్వల్పంగా వంతెన కుంగింది. Style="height: 10px;overflow: Hidden"
గామన్ బ్రిడ్జ్( Gammon Bridge ) లోపాన్ని గుర్తించిన బ్రిడ్జ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ పై రాకపోకలను దారి మళ్లించారు.అదేవిధంగా బ్రిడ్జ్ ఎడమవైపు వాహనాలను పూర్తిగా నియంత్రించారు.
అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్ అండ బీ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
కాగా కొవ్వూరు - రాజమండ్రి మధ్య 2007 లో ఈ బ్రిడ్జి నిర్మితమైంది.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!