రాజకీయంలో ఏది శాశ్వతం కాదనే చెప్పాలి.ఏళ్లుగా అధికారం చెలాయించి.
ఒక్కోసారి రాజకీయంగా బ్రేక్ తీసుకుంటుంటారు.తమకు వీలు పడకనో.
బిజినెస్ లు ఉండటంతోనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేయలేరు.ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఉండకపోతే ఆదరణ తగ్గిపోతుంది.
దీంతో పార్టీలు కూడా సీటు ఇవ్వడానికి సుముఖత చూపవు.అలాగే క్రింది స్థాయి నేతలూ సపోర్ట్ చేయరు.
కార్యకర్తలు కూడా ఎప్పుడు అండగా ఉండే నేతల కోసమే కష్టపడి పనిచేస్తారు.అయితే ఇవన్నీ సహకరించకపోతే ఏళ్లుగా కుటుంబాలు రాజకీయాలు ఏలినా పక్క.
చిత్తూరు జిల్లాలో అయితే గల్లా అరుణ కుమారి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా హవా కొనసాగించింది.ఇక 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు గల్లా జయదేవ్ గెలిచారు.
గల్లా అరుణ కుమారి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.ఆయన కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు.
ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కడం అనుమానంగానే కన్పిస్తుంది.ఇక వచ్చే ఎన్నికలలో గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
అయితే గల్లా కుటుంభ సభ్యులు పారిశ్రామికవేత్తలుగా వారు రాణించారు.రాజకీయాల్లో అనేక విజయాలు సాధించినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వారికి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
నేతల అసంతృప్తి కూడా కారణం.ఇక గల్లా జయదేవ్ అయితే ఆయన పెద్దగా నియోజకవర్గంలో పర్యటించరు.ప్రజలకు దూరంగా ఉంటారు.పార్టీ క్యాడర్ తో కూడా గల్లా జయదేవ్ కలివిడిగా ఉండరు.
గడిచిన మూడేళ్ల కాలంలో అడపా దడపా తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్నది లేదు.విదేశీ పర్యటనలు, వ్యాపారాలను చూసుకోవడంతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారన్న టాక్ వినిపిస్తోంది.
లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఢిల్లీలో కనపడతారని అంటున్నారు.ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ కు గల్లా జయదేవ్ కు మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు.

అయితే ఇటీవల గుంటూరు టీడీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో గల్లా జయదేవ్ కు టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబును కోరినట్లు సమాచారం.ఆ ప్రభావం తమపై పడుతుందని బాబుతో తమ ఆందోళన చెప్పుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ పనితీరును అంచనా వేస్తున్నారట.అయితే ఆర్థికంగా బలమైన నేత కావడంతో వేరే చోట జయదేవ్ కు టిక్కెట్ ఇవ్వాలా.
ఇక్కడే కొనసాగించాలా.అనే కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉంది.