గబ్బర్ సింగ్ బ్యాచ్ తో టీఆర్ఎస్ ప్రచారం !

సినీ స్టార్స్ తో ప్రచారం చేయించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుంది.అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతిని.

 Gabbarsing Batch Election Campain On Trs Mla Candidate-TeluguStop.com

కుష్బూ వంటి మాజీ హీరోయిన్స్ తో ప్రచారం జోరుగా చేయిస్తోంది.అయితే మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటూ టీఆర్ఎస్ పార్టీ కూడా సినిమా వాళ్ళతో ఇప్పుడు ప్రచారం చేస్తూ… ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.అయితే… పెద్ద పెద్ద హీరోలు… హీరోయిన్స్ తో ప్రచారం కాదు .గబ్బర్ సింగ్ బ్యాచ్ తో.అవును ఆ మధ్య వచ్చిన సినిమాలో ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ అంతా బాగా ఫేమస్ అయిపోయారు.అందుకే… మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరుపున వారు ప్రచారం నిర్వహించారు.పదో వార్డులో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.

ఆ తరువాత పట్టణంలో రోడ్ షో నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫిష్‌ వెంకట్ మాట్లాడుతూ.

నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించామని తెలిపారు.శంకర్‌ నాయక్‌ మంచి వ్యక్తి కావడంవల్లే హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube