'హాయ్ నాన్న' నుండి గాజు బొమ్మ.. ఆకట్టుకున్న ఎమోషనల్ సాంగ్!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) నటిస్తున్న సరికొత్త మూవీ ‘‘హాయ్ నాన్న”.( Hi Ninna ) ఎప్పుడు డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు.

 Gaaju Bomma Promo From Hi Ninna Out, Hi Ninna, Gaaju Bomma Song, Nani , Sh-TeluguStop.com

దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని అలానే కంటెంట్ ఉన్న స్టోరీలను ఎంచుకుంటూ ఇది వరకు కంటే బెటర్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

నాని ప్రస్తుతం తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.”హాయ్ నాన్న” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూ( Mrunal Thakur )ర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.

ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ కూడా వచ్చింది.

ఇది ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసారు.

ఇది ఎమోషనల్ సాంగ్ అని అర్ధం అవుతుంది.గాజు బొమ్మ అనే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Kiara Khann ) కీ రోల్ పోషిస్తున్నారు.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే డిసెంబర్ 21న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.దసరా హిట్ ను నాని హాయ్ నాన్న సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube