యంగ్ టైగర్ ఎన్టీఆర్( JR ntr ) ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తో పాన్ వరల్డ్ స్టార్ డమ్ ని దక్కించుకున్న విషయం తెల్సిందే.హీరో గా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా ను చేస్తున్నాడు.
దేవర సినిమా కథ రీత్యా పెద్ద గా ఉంటుంది.కనుక సింగిల్ పార్ట్ లో సినిమా ను విడుదల చేయలేక పోతున్నాం.
అందుకే సినిమా ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించడంతో కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కొరటాల శివ గత చిత్రం ఆచార్య ఫెయిల్ అయింది.
అంతే కాకుండా ఎన్టీఆర్ తో గతం లో కొరటాల శివ రూపొందించిన జనతా గ్యారేజ్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.

కనుక ఎన్టీఆర్ మరియు కొరటాల శివ( Koratala Siva ) కాంబో సినిమా పై నందమూరి ఫ్యాన్స్ లో పెద్దగా అంచనాలు, ఆసక్తి లేదు.అందుకే దేవర సినిమా ను రెండు పార్ట్ లుగా విడుదల చేయడం ఏమాత్రం సరి కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.దేవర సినిమా ను సింగిల్ పార్ట్ గా చూడటమే కష్టం అనుకుంటూ ఉంటే రెండు భాగా లుగా విడుదల చేస్తే ఎవరు చూస్తారు సార్ అంటూ స్వయంగా కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా కొరటాల శివను ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి కొరటాల శివ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్టీఆర్ సమర్థించినా కూడా ఆయన అభిమానులు మాత్రం తప్పుబడుతున్నారు.ఎన్టీఆర్ తదుపరి సినిమా ను ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో చేయబోతున్నాడు.ఆ సినిమా ను కూడా రెండు భాగాలు గా తీసుకు వస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి దేవర సినిమా రెండు భాగాలు వద్దు కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా రెండు భాగాలుగా రావాలని మాత్రం చాలా మంది కోరుకుంటున్నారు.







