సూర్యాపేట జిల్లా: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కన్వీనర్ మల్లెల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పెంచిన వేతనాలు అమలు చేయాలని,పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.22 వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అన్నారు.ఈనెల 9న ఛలో కలెక్టరేట్ ముట్టడికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమా, రహీమా,నాగమ్మ,మణెమ్మ,అంజమ్మ,భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.







