గోవా వేదికగా నేటి నుంచి జీ-20 సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి దాదాపు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సమావేశాలలో పాల్గొనేందుకు జీ-20 ప్రతినిధులు గోవాకు చేరుకున్నారు.
ఇవాళ, రేపు జీ -20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనుండగా.తరువాతి రెండు రోజులు టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాలు, పర్యాటక రంగంలో ఎమ్ఎస్ఎమ్ఈతో పాటు టూరిజం డెస్టినేషన్ అంశాలపై ప్రతినిధులు ప్రధానంగా చర్చించనున్నారు.ప్రస్తుతం ప్రపంచంలోని పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు వాటి పరిష్కారాలపై చర్చించనున్నారు.







