కాన్వెంట్ జంక్షన్ వద్ద అంత్యక్రియలకు మృత దేహం తీసుకుని వెళ్తున్న వాహనం బోల్తా
విశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఇలా ఉంది.
పూర్ణ మార్కెట్ సమీపంలోని రెల్లివీధిలో ఓ మూగ మనిషి అనారోగ్యంతో మృతి చెందారు.ఈ నేపథ్యంలో స్థానికులు పాడుకట్టి వాహనం మీద అంత్యక్రియలకు తరలిస్తుండి ఆచారం ప్రకారం కొబ్బరితోట పొలిమేర వద్ద పాడు దించారు.
అనంతరం దహన సంస్కరణలు నిమిత్తం కాన్వెంట్ సమీపంలోని చావులమదం శ్మశాన వాటికకు తరలిస్తుండగా ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వాహనం తిరగబడి ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో వాహనం మీద ఉన్న సుమారు 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన పలువురు స్థానికులు ఘటన చోటుకు హుటాహుటిన చేరురుకొని గాయపడిన క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు ఆటోల్లో తరలించారు.