మే 16 తేదీన జరుగు డెంగీ నివారణ దినోత్సవంలో భాగంగా అన్ని ప్రాధమిక మరియు పట్టన ఆరోగ్య కేంద్రాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు .పారిశుధ్య నివారణే డెంగీ నివారణకు మార్గమని ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రైడే పాటించాలని తద్వారా దోమలు పుట్టకుండా చేసినట్లయితే డెంగీ వ్యాధిని నివారించ వచ్చని తెలియ జేసినారు .
రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలంతా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమలు పుట్టకుండా చేయవచ్చునని దోమల వచ్చే వ్యాధులైన మలేరియా ,డంగీ ,చికున్గున్యా ,ఫైలేరియా మరియు మెదడువాపు లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున ప్రజలందరూ దోమల యెడల అప్రమత్తంగా ఉండాలని కోరారు తప్పని సరిగా డ్రైడే పాటించాలని ,పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని యిండ్లలోని కూలర్లలోని నీటిని ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని కోరారు .కొబ్బరి బొండాలు ,పూలకుండీలు ,టైర్లు రోళ్ళు ,పాడుబడిన ప్లాస్టిక్ సామానులలో నీరు నిల్వ లేకుండా చూడాలని ఈ విషయాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు .వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కీటక జనిత వ్యాధులపై ప్రజలలో పూర్తి అవగాహన కల్పించాలని కోరారు జ్వరము ,తలనొప్పి ,వళ్లునొప్పులు చర్మముపై ఎర్రటి దద్దురులు ఉంటె వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు .అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే కీటకాల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా చేయవచ్చని తెలియజేసారు .కావున మే 16 న జరుగు డెంగీ నివారణా దినోత్సవంను విజయవంతం జేయాలని కోరారు .







