ఏపీలో యంగ్ మంత్రికి సొంత నియోజవర్గం లేకుండా పోయింది.వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలా.
అని మదనపడుతున్నారు.ఆయనే గుడివాడ అమర్ నాథ్.
అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ మంత్రివర్గ విస్తరణ మలివిడతలో మంత్రి పదవి దక్కించుకుని 2022 ఏప్రిల్ 11న పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ఇప్పుడు ఆయనకు ఎక్కడి నుంచి పోటీచేయలనే సమస్య వచ్చిపడింది.
మూడుపదుల వయసున్న గుడివాడకు ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది.కానీ సొంత సీటు అంటూ లేకుండా పోయింది.
అయితే 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడమే పక్క జిల్లాలో చేశారు.విశాఖలోని గాజువాకకు చెందిన గుడివాడ అనకాపల్లి నుంచే 2014 ఎన్నికల ద్వారా రాజకీయంగా పోటీ చేస్తూ వస్తున్నారు.
అనకాపల్లి.నాన్ లోకల్.!
కాగా గుడివాడ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2006లో తన 21వ ఏటలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలిచాడు.అంతేకాకుండా అతి పిన్న వయస్సులో విశాఖపట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశాడు.
ఇక 2011లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు.ఆ తర్వాత వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా పని చేశారు.
ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఇక 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
కాగా 2024లో మళ్లీ అనకాపల్లి అంటే అసలు కుదిరేట్టుగా కనిపించడం లేదు.ఎందుకంటే ఆయన పక్కా నాన్ లోకల్ అని ప్రచారం సాగుతోంది.

దాంతో ఆయన వేరే సీటు నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టారు.మధ్యలో ఎలమంచిలిని కూడా టచ్ చేయాలని చూస్తే అక్కడ సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజు నుంచి అటాక్ మొదలైందని టాక్.ఇక తన తండ్రి తాత పోటీ చేసి గెలిచిన పెందుర్తి నుంచి పోటీ చేసి బరిలోకి దిగుతామని అనుకుంటే అక్కడ ఉన్న యువ ఎమ్మెల్యే అదీప్ రాజ్ హై కమాండ్కి దీని మీద ఫిర్యాదు చేశారని అంటున్నారు.ఇక అక్కడ కూడా యువ మంత్రికి లోకల్ గా వ్యతిరేకత ఉందని తేలడంతో ఇపుడు చూపు గాజువాక మీద పెట్టారని అంటున్నారు.
నిజానికి ఆయన సొంత ప్రాంతం ఇదే.అయితే ఇక్కడ తిప్పల ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది.సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2006 నుంచి గట్టిగా పాతుకుపోయారు.2009 నుంచి వరసగా మూడు సార్లు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ఆయనను గెలుపు వరించింది.

ఈసారి ఆయన తాను కానీ తన వారసులు కానీ ఇదే సీటు నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు.ఈ టైమ్ లో గుడివాడ ఈ సీటు మీద కన్నేశారని తెలియడంతో తిప్పల వర్గంలో అలజడి రేగిందంటున్నారు.అయినా సరే జగన్ వద్ద ఉన్న తమ సాన్నిహిత్యంతో సీటు తమకే దక్కుతుందనే భరోసాతో ఉన్నారట.అయితే ఇక్కడ పోటీకి మంత్రి గారి లెక్కలు వేరుగా ఉన్నాయని అంటున్నారు.
ఇక్కడ ఆయన సామాజికవర్గం ఎక్కువగా ఉంది.దాంతో పాటు తన సొంత ప్రాంతమని చూపించబోతున్నారు.
అదే విధంగా తిప్పల వయసుని కూడా ముందు పెట్టి టికెట్ అడుగుతారు అని అంటున్నారు.అయితే తాను కాకపోతే తన వారసులకే టికెట్ ఇవ్వాలని తిప్పల వారి నుంచి డిమాండ్ వస్తోందిట.
మరి ఇలా మూడు సీట్లను చూసుకున్నా ఎక్కడా ఈ యువ మంత్రికి పోటీ చేసే సీటుపై క్లారిటీ రాలేదు.దీంతో వచ్చే ఎన్నికల్లో గుడివాడ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే వాదన వినిపిస్తోంది.