ఇకనుండి గ్యాస్ సిలిండర్ వాడే వారికి పండగే పండగ... ఏకంగా రూ.1000 వరకు తగ్గింపు?

కరోనా తరువాత పెరిగిన నిత్యావసర ధరలలో గ్యాస్ సిలిండర్ ప్రధానమైనది.ఒకప్పుడు 500 ఖరీదు వున్న గ్యాస్ బండ నేడు 1100 రూపాయిలు పెరిగి సామాన్యుడి నడ్డిమీద గుదిబండగా మారింది.

 From Now On, It Will Be A Festival For Those Who Use Gas Cylinders A Discount Of-TeluguStop.com

దాంతో ప్రజలు మరలా కట్టెల పొయ్యిమీద దృష్టి పెట్టారు.పల్లెటూళ్లలో సరేసరి, పట్టణాల సంగతి ఏమిటి? ఇక్కడివారు చచ్చినట్టు గ్యాస్ బండ వాడాల్సిందే.వేరే ప్రత్యామ్నాయం లేనేలేదు.ఇలాంటి పరిస్థితులలో ఏవైనా ఆఫర్లు ఊరిస్తే ఎలా ఉంటుంది? ఎగిరి గంతేయాలనిపిస్తుంది కదూ.

అవును, ఇపుడు మీరు సిలిండర్ బుక్ చేయాలని అనుకుంటే మీకు ఓ శుభవార్త.మీకోసం పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తాజాగా Paytm పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తోంది.Paytm ద్వారా LPG గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే క్యాష్‌ బ్యాక్ వస్తుంది.

వందో రెండువందలో కాదు.రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు మరి.ప్రస్తుతం Paytm LPG సిలిండర్ బుకింగ్‌పై 4 రకాల ఆఫర్లను అందుబాటులో ఉంచింది.వీటి ద్వారా రూ.5 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.అయితే ఇక్కడ ఎవరికి ఎంత క్యాష్‌ బ్యాక్ వస్తుందో చెప్పడం కష్టం.

రూ.5 నుంచి రూ.1000 వరకు మధ్యలో ఎంతైనా రావొచ్చు.Paytm అందిస్తున్న 4 రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లలో గ్యాస్1000 అనే ప్రోమో కోడ్ ఉంది.

సిలిండర్ బుకింగ్ సమయంలో ఈ ప్రోమో కోడ్ వాడితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది.అలాగే ఫ్రీగ్యాస్ అనే ప్రోమో కోడ్ కూడా అందుబాటులో ఉంది.ఈ ప్రోమో కోడ్ ఎంచుకుంటే.ప్రతి 500వ కస్టమర్‌కు రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ రావడం పక్కా అని చెబుతున్నారు.అలాగే Paytm మరో ఆఫర్… AU క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేస్తే.రూ.50 వరకు తగ్గింపు పొందొచ్చు.దీనికి AUCC50 ప్రోమో కోడ్ వాడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube