వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి, విడాకులు కూడా!

వర్షాలు కురవాలంటూ కప్పలకు పెళ్లిళ్లు చేయడం వంటి ఘటనలు చాలా చోట్ల చోటుచేసుకుంటూనే ఉన్నాయి.పురాణ కాలం నుంచి కూడా ఇలా కప్పలకు పెళ్లిళ్లు చేస్తే భారీగా వర్షాలు కురుస్తాయి అంటూ ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు.

 Frog Couple Divorced-TeluguStop.com

అయితే ఒకవేళ వర్షాలు ఎక్కువ గా కురిస్తే దానికి పరిష్కారం ఏంటి అన్న విషయం మాత్రం తెలియదు.అయితే మధ్యప్రదేశ్ లో ప్రజలు ఈ విపరీత వర్షాలకు ఒక కొత్త పరిష్కారం కనుగొన్నారు.

వర్షాలు కురవాలని కోరుతూ జులై 19న ఆ కప్పలకు పెళ్లి జరిపించారు.ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో 26శాతం అధిక వర్షపాతం నమోదైంది.

వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి.చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దీనితో వర్షాలు కురవాలని పెళ్లి చేసిన కప్పలకు వేద మంత్రోచ్ఛరణల నడుమ విడాకులు కూడా ఇప్పించేసినట్లు తెలుస్తుంది.

Telugu Frog Divorced, Frog, Frog Fall, Telugu Ups-

  ఓం శివశక్తి మండల్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ విడాకుల తంతు జరిపించారు.కప్పలకు విడాకులు ఇప్పించడం ద్వారా భారీ వర్షాలు ఆగిపోతాయని వారు నమ్ముతున్నారు.అయినా కప్పలకు విడాకులు ఇప్పిస్తే వర్షాలు ఆగిపోవడం ఏంటో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube