బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం రేపటి నుంచి ఇవి తప్పనిసరి..!!

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చడం జరిగింది.మహాలక్ష్మి పథకం( Maha Lakshmi Scheme ) పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది.

 Free Travel For Women In Buses Is Mandatory From Tomorrow Vc Sajjanar, Congress,-TeluguStop.com

ఈ క్రమంలో రేపటినుండి అనగా శుక్రవారం నుంచి TSRTC బస్సులలో మహిళలకు ₹0 టికెట్ ఇస్తున్నట్లు ఎండి వీసీ సజ్జనార్ స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో ప్రతి ప్రయాణికురాలు.

తమ వెంట ఫోటో గుర్తింపు కార్డు ఆధార్ లేదా ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు.

స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి… విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి అని స్పష్టం చేశారు.

ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినిలు, థర్డ్ జెండర్లు.ఉపయోగించుకోవాలి అని సజ్జనార్ స్పష్టం చేయడం జరిగింది.ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు టీమ్ మేషన్ లలో ప్రత్యేక సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసినట్లు స్పష్టం చేయడం జరిగింది.ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సజ్జనార్( VC Sajjanar) స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం క్షేత్రస్థాయి అధికారులతో సజ్జనార్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ సాఫ్ట్ వేర్.

అప్ డేట్ అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులను అభినందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube