బాహుబలి చిత్రం తర్వాత ఇండియా లో ప్రభాస్( Prabhas ) ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరూ లేరని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయ పడ్డారు.ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కి కేవలం సౌత్ ఇండియా మాత్రమే గ్రిప్ ఉంది.
అలాగే బాలీవుడ్ ఖాన్స్ త్రయం కి కేవలం నార్త్ ఇండియా మార్కెట్ తప్ప, సౌత్ ఇండియా మార్కెట్ లేదు.కానీ నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా లో సరిసమానమైన క్రేజ్, మార్కెట్ మరియు ఫాలోయింగ్ ఉన్న ఏకైక సూపర్ స్టార్ ఒక్క ప్రభాస్ మాత్రమే.
ఇందులో ఎలాంటి డౌట్ లేదు.బాహుబలి సిరీస్ తప్ప ప్రభాస్ చేసిన పాన్ ఇండియన్ చిత్రాలు మొత్తం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్స్ ని తెచ్చుకున్నాయి.
అయినా కూడా ఆ సినిమాలకు వచ్చిన వసూళ్లు ప్రభాస్ తోటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ కంటే ఎక్కువ వచ్చాయి.
![Telugu Salaar, Baahubali, Bollywood, Dunki, Prabhas, Rajkumar Hirani, Shah Rukh Telugu Salaar, Baahubali, Bollywood, Dunki, Prabhas, Rajkumar Hirani, Shah Rukh](https://telugustop.com/wp-content/uploads/2023/12/Salaar-Shah-Rukh-Khan-Dunki-prabhas-tollywood-bollywood.jpg)
ఇంతకు మించి చెప్పేది ఏముంది, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఇండియా లో ఎవ్వరూ లేరని.ఇకపోతే ఈ ఏడాది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పఠాన్ మరియు జవాన్ సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు.ఇప్పుడు ఆయన డిసెంబర్ 21 వ తారీఖున రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) తో ‘డుంకీ‘( Dunki ) అనే చిత్రం తో మన ముందుకి రాబోతున్నాడు.
ఈ సినిమా విడుదలైన పక్క రోజే సలార్ చిత్రం విడుదల అవ్వబోతుంది.ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై చాలా రోజులు అయ్యింది.
ప్రభాస్ ‘సలార్( Salaar)’ చిత్రానికి 7 లక్షల అమెరికన్ డాలర్స్ రాగ, డుంకీ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం లక్ష డాలర్లు మాత్రమే వచ్చింది.ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.
ఎందుకంటే షారుఖ్ ఖాన్ గత రెండు చిత్రాలు నార్త్ అమెరికా లో 15 మిలియన్ డాలర్ల వసూళ్లకు పైగా రాబట్టింది.
![Telugu Salaar, Baahubali, Bollywood, Dunki, Prabhas, Rajkumar Hirani, Shah Rukh Telugu Salaar, Baahubali, Bollywood, Dunki, Prabhas, Rajkumar Hirani, Shah Rukh](https://telugustop.com/wp-content/uploads/2023/12/Rajkumar-Hirani-Salaar-Shah-Rukh-Khan-Baahubali-2-Dunki-prabhas-tollywood-bollywood.jpg)
అలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానీ లాంటి డైరెక్టర్ తో ఇలాంటి ప్రీమియర్ నంబర్స్ పెడతాడని ట్రేడ్ అసలు ఊహించలేదు.సలార్ కి దగ్గర్లో ఉంటే పర్వాలేదు అనుకోవచ్చు కానీ, సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కి 7 రెట్లు తక్కువ ఉండడమే షారుఖ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.మరోపక్క ప్రభాస్ స్టార్ స్టేటస్ ని బాలీవుడ్ క్రిటిక్స్ సైతం నోరెళ్లబెడుతున్నారు.
బాహుబలి 2 చిత్ర వసూళ్లను ఇప్పటి వరకు ఏ సూపర్ హిట్ సినిమా కూడా అందుకోలేదని, సలార్ చిత్రానికి టాక్ వస్తే బాహుబలి 2 వసూళ్లను భారీ మార్జిన్ తో కొడుతుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు.
.