ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్( Flipkart ) తమ యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.త్వరలో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం పేరుతో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రీమియం మెంబర్‌షిప్ ద్వారా మరిన్ని ఆఫర్లు, డీల్స్ కల్పించనుంది.ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ పేరుతో ఒక సర్వీస్ అందుబాటులో ఉంది.
దీని ద్వారా ఉచిత డెలివరీతో పాటు కొన్ని ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ప్రకటిస్తోంది.అలాగే కొన్ని డీల్స్‌ను మిగతా యూజర్ల కంటే ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లు పొందే అవకాశం కల్పిస్తోంది.

అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్( Flipkart Plus Premium ) సేవలను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ మెంబర్‌షిప్ ద్వారా సాధారణ షాపింగ్ చేస్తే సూపర్ కాయిన్స్‌ను పొందవచ్చు.పూర్తి ఉచితంగా ఈ ప్రీమియం సర్వీస్ అందిస్తారు.ప్రస్తుత కస్టమర్ బెనిఫిట్స్ ప్రొగ్రామ్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కి అడ్వాన్స్ సర్వీసుగా ఇది ఉపయోగపడనుంది.ఈ ప్రీమియం మెంబర్‌షిప్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరో రెండు వారాల్లో ఫ్లిప్‌కార్ట్ ప్రీమియం మెంబర్‌షిప్‌కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లో వర్చువల్ కరెన్సీ అయిన సూపర్ కాయిన్స్ ద్వారా కస్టమర్లకు రివార్డులు అందిస్తోంది.ఏమైనా ప్రొడక్ట్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసినప్పుడు ఈ సూపర్ కాయిన్స్ ద్వారా తగ్గింపు వస్తుంది.
అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ గా మారడానికి యూజర్లు 200 సూపర్ కాయిన్లను ఉపయోగించుకోవచ్చు.అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ కలిగినవారు కొనుగోలు చేసే ప్రతీ రూ.100కి 4 సూపర్ కాయిన్స్ వస్తాయి.త్వరలో స్వాతంత్ర దినోత్సవం( Independence Day ) సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను ప్రకటించనుంది.
అప్పటిలోగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం మెంబర్‌షిప్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.అలాగే దీపావళికి ముందు మరో సేల్ ఈవెంట్ ఫ్లిప్‌కార్ట్ నిర్వహిచనుందని తెలుస్తోంది.







