2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి( Corona Virus ) ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .
లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.
అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ తీవ్రత తగ్గింది.అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు మానవాళిపై దాడి చేస్తూనే వున్నాయి.
శాస్త్రవేత్తలు సైతం కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరిస్తూనే వున్నారు.
ఇదిలావుండగా.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ బుధవారం అమెరికన్లకు ఫ్రీ కోవిడ్ 19 హోమ్ పరీక్షలను( Free COVID-19 Home Tests ) అందించే ప్రోగ్రామ్‌ను పున: ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.కోవిడ్ 19 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత .ఈ ఏడాది మేలో కార్యక్రమం నిలిపివేయబడింది.ఈ సందర్భంగా హెచ్‌హెచ్ఎస్ సెక్రటరీ జేవియర్ బెసెరా( HHS Secretary Xavier Becerra ) వాషింగ్టన్ సీవీఎస్ ఫార్మసీలో మాట్లాడుతూ.
సెప్టెంబర్ 25 నుంచి అమెరికన్లు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.

అమెరికన్లు Covidtests.gov నుండి ప్రతి ఇంటికి నాలుగు ఉచిత పరీక్షలను ఆర్డర్ చేయవచ్చు.అమెరికా ప్రభుత్వం Covidtests.
gov ద్వారా ఆర్డర్ చేసిన వ్యక్తులకు ఇప్పటి వరకు 755 మిలియన్లకు పైగా ఉచిత కోవిడ్-19 పరీక్షలను అందించింది.తాజా కార్యక్రమం 2023 చివరి వరకు అందుబాటులో వుంటుందని అమెరికా ప్రభుత్వం( USA Govt ) తెలిపింది.
హెచ్‌హెచ్ఎస్ దాని అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ వారు కూడా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ‘‘ 12 US COVID-19 test makers ’’ కొనుగోలు చేయనున్నారు.అలాగే 200 మిలియన్ల ఓవర్ ది కౌంటర్ కోవిడ్ 19 పరీక్షలను కొనుగోలు చేస్తామని చెప్పారు.
ఈ నిధులు న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, డెలావేర్‌లోని తయారీదారులకు వెళ్తాయి.

ఇకపోతే.గత జూలై నుంచి అమెరికాలో( America ) మళ్లీ కోవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.గత రెండు నెలలతో పోలిస్తే వారం వారీ అడ్మిషన్‌ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.సెప్టెంబర్ 9తో ముగిసిన వారంలో అమెరికాలో 20,500 మందికి పైగా ప్రజలు కోవిడ్ 19తో ఆసుపత్రి పాలయ్యారు.
ఇది మునుపటి వారం కంటే 8 శాతం ఎక్కువ.