అతి చిన్న వయసులో 9,000 పరుగులు పూర్తి చేసుకున్న నలుగురు స్టార్ ప్లేయర్లు..

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట కు అభిమానుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే మన దేశ క్రికెట్ ప్లేయర్ లను అభిమానులు దేవుళ్ళుగా అభిమానిస్తారు.

 Four Star Players Who Completed 9,000 Runs At The Youngest Age , 9,000 Runs , En-TeluguStop.com

అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడు కచ్చితంగా టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకుంటాడు.కానీ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే నైపుణ్యంతో పాటు, ఎంతో ఓపిక కూడా ఉండాలి.

అందుకే టెస్ట్ క్రికెట్లో చేసిన ఒక్క పరుగు కూడా ఆ బ్యాటర్లకు ఎంతో ముఖ్యమైనది.ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయినా అలెస్టర్ కుక్ తన కెరీర్‌లో 30 సంవత్సరాల 159 రోజుల వయస్సులో 9000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన వారిలో అతి చిన్నవాడు కుక్.2015లో న్యూజిలాండ్‌పై కుక్ ఈ ఘనతను సాధించాడు.చిన్న వయసులో 9000 టెస్ట్ పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ రెండవ స్థానంలో ఉన్నాడు.

జో రూట్ తన టెస్టు కెరీర్‌లో 30 ఏళ్ల 227 రోజుల వయసు లో 9000 పరుగులు సాధించాడు.లార్డ్స్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ లో అతను ఈ ఘనత సాధించాడు.సచిన్ తన టెస్టు కెరీర్‌లో 30 ఏళ్ల 253 రోజుల వయసులో 9000 పరుగులను పూర్తి చేశాడు.2004లో ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన టెస్టులో టెండూల్కర్ తన 179వ ఇన్నింగ్స్‌లో ఈ సంఖ్యను సాధించాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ కేవలం 31 ఏళ్ల 341 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.కెరీర్‌లో 177వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో పాంటింగ్ ఒకడు.అతని టెస్ట్ కెరీర్‌లో, పాంటింగ్ 168 మ్యాచ్‌లలో 13378 పరుగులు చేశాడు మరియు ఆస్ట్రేలియా యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఉండేవాడు.

ఈ దిగ్గజాలు క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరికీ వీలు కావాలంటే రికార్డులను నెలకొల్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube