ప్రస్తుత సమాజంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు పెద్ద పెద్ద ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి.
దీనికి ముఖ్య కారణం అతి వేగమే అని చాలామంది మేధావులు చెబుతున్నారు.కాస్త వేగం తగ్గించి ప్రయాణం చేస్తే ఎవరికీ ఎటువంటి ప్రమాదం ఉండదు.
ఇలా వేగంగా ప్రయాణించేవారు వారి ప్రాణాలకే కాకుండా వేగాన్ని తగ్గించి ప్రయాణించే వారి ప్రాణాలకు కూడా ప్రమాదాన్ని తెస్తున్నారు.ముఖ్యంగా ఇలా ఎక్కువగా వేగంగా వాహనాలు నడిపే ప్రమాదకరమైన అలవాటు నేటితరం యువత కాస్త తగ్గించుకుంటే మంచిది.
గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు అక్కడికి అకడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ నలుగురు భారత్ కి చెందిన వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు క్రిమియాలోని సింఫేరోపోల్ సమీపంలో ప్రమాదానికి గురై వారంతా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన సంఘటన రష్యాలో జరిగింది.
కారును వేగంగా నడుపుతూ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయిపోవడం వల్ల అందులో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల్లో ఇద్దరు మెడిసిన్ మూడవ సంవత్సరం, మరో ఇద్దరూ మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు రష్యా అధికారిక స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
మృతి చెందిన వారు భారతీయ విద్యార్థులు కావడంతో ఇండియన్ ఎంబాసికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రాథమికంగా సేకరించిన సమాచారం ప్రకారం రెనో లోగాన్ కారులో ఈ నలుగురు విద్యార్థులు క్రిమియా లోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వేగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.వాతావరణం సరిగ్గా లేని కారణంగా డ్రైవర్ కారు పై అదుపు కోల్పోయాడని, దాంతో వేగంగా వెళుతున్న కారు రహదారి పక్క కు వెళ్లి అక్కడి చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.