యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని.
ఔట్ పుట్ విషయంలో ప్రభాస్ చాలా సంతృప్తిగా ఉన్నాడట.అందుకే వెంటనే రెండవ షెడ్యూల్ మొదలైంది.
హైదరాబాదులో ఒక స్టూడియోలో రాజా డీలక్స్ అనే ఒక పాత కాలపు థియేటర్ సెట్ వేశారట.అక్కడే చిత్రీకరణ జరుగుతుంది.
సినిమా కు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు మరియు టాకీ పార్ట్ షూటింగ్ చేస్తున్నారని సమాచారం అందుతుంది.ఈ షెడ్యూల్ తో సినిమా దాదాపుగా 30% చిత్రీకరణ పూర్తి అవుతుంది అంటూ మారుతి సన్నిహితులు చెబుతున్నారు.
అయినా ఇప్పటి వరకు సినిమా గురించి అధికారికంగా ఏ ఒక్క ప్రకటన రాలేదు.
అసలు ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో సినిమా రూపొందుతుంది అంటూ కూడా అధికారికంగా ఏ ఒక్కరూ సమాచారం ఇవ్వలేదు.
ఈ సినిమా ను మొదట దానయ్య నిర్మిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతుంది.వారు కూడా ఎక్కడ ఈ విషయం గురించి స్పందించ లేదు.అతి త్వరలోనే ఈ సినిమా యొక్క అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రమే ఫస్ట్ లుక్ కానీ, అధికారిక ప్రకటన కానీ, టీజర్ కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.ఇక ప్రభాస్ ఇతర సినిమాల విషయానికి వస్తే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.వచ్చే ఏడాది ద్వితీయ అర్థంలో స్పిరిట్ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది.
ఇదే సమయంలో బాలీవుడ్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు.అది 2024 సంవత్సరంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.







