యూకే: నాలుగు రోజుల క్రితం రైలులో అదృశ్యం.. భారత సంతతి తల్లీకూతుళ్లు క్షేమం

యూకేలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన భారత సంతతికి చెందిన తల్లీకూతుళ్ల ఆచూకీ లభ్యమైంది.

లీసెస్టర్ నగరం నుంచి కనిపించకుండా పోయిన వీరిద్దరూ క్షేమంగా ఉన్నట్లు యూకే పోలీసు విభాగం ప్రకటించింది.

ఈ నెల 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 34 ఏళ్ల కోమల్ కరాజీ తన ఏడేళ్ల కుమార్తె అమయ గోరానియాతో కలిసి లీసెస్టర్‌లోని తన ఇంటి నుంచి టాక్సీలో రైల్వేస్టేషన్‌కు వెళ్లారు.అక్కడ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే రైలు ఎక్కిన తర్వాతి నుంచి వీరిద్దరూ కనిపించకుండాపోయారు.

రంగంలోకి దిగిన పోలీసులు కోమల్ కరాజీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు.అదృశ్యమవ్వడానికి ముందు ఆమె నల్లటి పొడవైన రెయిన్ కోట్, లేత నీలిరంగు జీన్స్ ధరించగా, లేత బూడిద లేదా నీలం రంగు హ్యాండ్‌బ్యాగ్‌ చేతిలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.ఏడేళ్ల అమయ పింక్ కలర్ జాకెట్, తెలుపు షూలనను ధరించిందని వీరి ఆచూకీ తెలిస్తే.101 నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా పోలీసులు ట్వీట్ చేశారు.దీనికి స్పందించిన కొందరు సమాచారం అందించడంతో పోలీసులు కమల్ ఆమె కుమార్తెను కనుగొన్నట్లు ప్రకటించారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు