రాబిన్‌ శర్మ టీడీపీ జీతగాడు.. అందుకే ఇలాంటి సర్వే: పేర్ని నాని

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్‌ అయ్యారు.పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.

 Former Ycp Minister Perni Nani Serious Comments On Tdp Survey Details, Former Yc-TeluguStop.com

‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉంది.ఇలా చెప్పిన సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్‌ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌ శర్మదే.

టీడీపీని కాపాడుకోవడానికి చేయించిన సర్వే ఇది.అందుకే వాళ్లు ఇలా రిపోర్టు ఇచ్చారు. 

పవన్‌ కల్యాణ్‌ ద్వారా టీడీపీ గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారు.కానీ, అలా జరగలేదు.తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్‌ లేవడం లేదు.వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది.

దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు.సీఎం వైఎస్‌ జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరు.వైఎస్‌ జగన్‌ అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.ఇలాంటి సర్వేలు సీఎం వైఎస్‌ జగన్‌కు ఏమీ చేయలేవు’’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube