రాబిన్ శర్మ టీడీపీ జీతగాడు.. అందుకే ఇలాంటి సర్వే: పేర్ని నాని
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు.
పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గిందనడం విచిత్రంగా ఉంది.
ఇలా చెప్పిన సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదే.
టీడీపీని కాపాడుకోవడానికి చేయించిన సర్వే ఇది.అందుకే వాళ్లు ఇలా రిపోర్టు ఇచ్చారు.
పవన్ కల్యాణ్ ద్వారా టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూశారు.కానీ, అలా జరగలేదు.
తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్ లేవడం లేదు.వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది.
దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు.సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరు.
వైఎస్ జగన్ అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.ఇలాంటి సర్వేలు సీఎం వైఎస్ జగన్‌కు ఏమీ చేయలేవు’’ అని అన్నారు.