ట్వీట్లు చేయడం కాదు... తాత కోసం తొడ కొట్టాలి ఎన్టీఆర్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి.ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

 Former Ycp Minister Anil Kumar Yadav Comments On Jr Ntr Tweet Details , Ntr,andh-TeluguStop.com

ఇలా ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం పట్ల నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ స్థాయినీ తగ్గించలేరు అంటూ చేసిన ట్వీట్ వైఎస్ఆర్సిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.అలాగే ఎన్టీఆర్ వైయస్ఆర్ ఇద్దరూ గొప్ప నాయకులే అంటూ ఈయన చేసిన ట్వీట్ పట్ల తెలుగుదేశం నేతలు బగ్గుమంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ ఎన్టీఆర్ అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందని ఆ గౌరవంతోనే జిల్లాల విభజనలో భాగంగా ఓ జిల్లా కి స్వర్గీయ తారక రామారావు పేరు పెట్టామని తెలిపారు.

Telugu Andhra Pradesh, Ycp, Jagan, Jr Ntr Tweet, Ntr, Sr Ntr, Tdp-Political

ఇలా ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు లేవని తెలుగుదేశం నేతల నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి.స్వర్గీయ రామారావు మీద కొందరు చెప్పులు విసిరారు అప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడలేదు.రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వేరొకరు కబ్జా చేశారు ఆ సమయంలో ఎన్టీఆర్ ఆవేదన ఆయన కుటుంబ సభ్యులకు ఏమాత్రం పట్టించుకోలేదనీ అనిల్ యాదవ్ ప్రశ్నించారు.

తాత కోసం ఇలా ట్వీట్లు చేయడం కాదు తొడ కొట్టి పోరాటం చేయాలి అంటూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube