పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తోంది.
ముషారఫ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారని సమాచారం.అటు మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చనిపోయినట్లు పాకిస్థాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది.
ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పని చేశారు.దేశ విభజనకు ముందు 1943, ఆగస్ట్ 11న ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు.ఆయన రాజకీయ నాయకుడుగానే కాకుండా సైనికాధికారిగా పని చేశారు.1999 లో ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టి పాకిస్తాన్ కి పదవ అధ్యక్షుడు అయ్యాడు.2001 నుంచి 2008 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా వ్యవహరించి తర్వాత అభిశంసన తీర్మానం ఎదుర్కొబోయే ముందు రాజీనామా చేశారు.