డైరెక్టర్ బాబీ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విషయం తెలిసిందే.
కాగా బాబి మెగాస్టార్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామిని సృష్టించింది.
అభిమాన హీరో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అభిమాని హీరోకి ఒక సూపర్ హిట్ మూవీని అందించారు డైరెక్టర్ బాబి.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇకపోతే ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోని డైరెక్టర్ బాబీ తాజాగా ఈ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తూ హైదరాబాద్ నుండి చిన్నతిరుపతి దేవాలయానికి వెళ్ళగా గన్నవరంలో మెగా అభిమానులు ఎదురై బాబీని ఘనస్వాగతం పలికారు.
అలాగే మెగా హిట్ ఇచ్చినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాబీతో ఫోటోలు దిగారు.సందర్భంగా బాబి అభిమానులతో మాట్లాడుతూ.మెగా ఫ్యాన్స్ కి ఓ క్రేజీ న్యూస్ అనౌన్స్ చేశాడు.
వాల్తేరు వీరయ్య మూవీని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.చిరంజీవి అవకాశం ఇవ్వడమే పెద్ద గిఫ్ట్ అని చెప్పాడు.అలాగే త్వరలోనే మెగా హీరోతో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిపారు.
దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బాబీ తన తదుపరి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.