దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తీవ్ర స్దాయిలో ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడి విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
అయినా గానీ ప్రజలు సహకరించక పోతే మాత్రం ప్రభుత్వాలు ఎంత చేసిన లాభం ఉండదు.
కాగా ఇప్పటికే దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతున్న నేపధ్యంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం నియంత్రణలో ఉందో అర్ధం కాని అయోమయం ప్రజల్లో నెలకొందట.
ఇదిలా ఉండగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పలు సూచనలు చేస్తూ ఆదివారం లేఖ రాశారట.
ఈ సందర్భంగా తాను చేసిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్.
ఇకపోతే వైరస్ నియంత్రణకు మన్మోహన్ చేసిన సూచనలు గమనిస్తే విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వడం. ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రోత్సహాకాలు, వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్ఢర్లు వంటి అంశాలను బహిరంగ పర్చడం, వ్యాక్సినేషన్ ఎంత మందికి అనేది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి అందించామనేది పరిగణలోకి తీసుకోవడం వంటి అంశాలు పరిశీలించాలని లేఖలో తెలిపారట.
మరి ఈ విషయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.