తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజుల నుండి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుండి.
బీజేపీ నీ టార్గెట్ చేసుకుని కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఇదే సమయంలో జాతీయ స్థాయి నాయకులు కేసీఆర్ కి కనెక్ట్ అవుతున్నారు.
బిజెపిని ఢీ కొట్టడానికి అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడానికి కూడా రెడీ అవుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు.నేషనల్ లెవెల్ లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో సీఎం కేసీఆర్ కి మాజీ ప్రధాని దేవేంద్ర గౌడ్ ఫోన్ చేయడం జరిగింది. జనతాదళ్ (సెక్యూలర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ దేశంలో మత తత్వ రాజకీయాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ కి అభినందనలు అని పేర్కొన్నారు.
లౌకికవాదం పరిరక్షణ కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందని స్పష్టం చేశారు.ఇదే రీతిలో యుద్ధాన్ని కేసీఆర్ కొనసాగించాలని దేవేందర్ గౌడ్ ఫోన్లో సంభాషించినట్లు సమాచారం.