ప్రధాని మోడీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్...!

గత కొన్ని సంవత్సరాల నుంచి భారత్, పాకిస్తాన్ దేశాల క్రికెట్ పరంగా చూస్తే ద్వైపాక్షిక సిరీస్ ను మనం చూసింది లేదు.

కేవలం ఐసిసి టోర్నమెంట్లో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్లు తలపడుతున్నాయన్నా సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం సంబంధించి తాజాగా పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నన్ని రోజులు పాకిస్తాన్, భారత్ ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగదని అభిప్రాయం తెలియజేశాడు .భారతదేశంలో పాకిస్తాన్ క్రికెట్ ఆడేందుకు పాక్ ప్రభుత్వం విషయంపై సుముఖంగా ఉన్నా, అందుకు సంబంధించి భారత ప్రభుత్వం అసలు సిద్ధంగా లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.అదే విధంగా ప్రపంచ పేరు గాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం సరైన నిర్ణయం కాదని పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టారు.

ఈ విషయం వల్ల ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ ఐపీఎల్ లో ఆడే అవకాశాన్ని కోల్పోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.అయితే ప్రపంచ క్రికెట్ లోనే ఐపీఎల్ అతిపెద్ద బ్రాండ్ గా ఉందని అఫ్రిది అంగీకరించాడు.

ఐపీఎల్ లో పాకిస్తాన్ ఆటగాళ్ళ ఆడలేక పోవడంతో వారు గొప్ప అవకాశాన్ని మిస్ అవుతున్నట్లు ఆయన విచారణ వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ యూఏఈ దేశంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇంకా తనకు భారతదేశంలో ఉన్న అనేక మంది అభిమానులు ఉన్నారంటే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ జట్టులోని క్రికెట్ సభ్యులకు భారతీయులు ఎంతో గౌరవం, ప్రేమ చూపేవారని ఆయన చెప్పాడు.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు భారత అభిమానుల నుంచి మెసేజ్స్ వస్తుంటాయని తెలియజేశాడు.అయితే ఏ విషయమో చెప్పలేదు కానీ, ఆయన మొత్తానికి భారత్ ద్వారా తనకు మంచి అనుభవం మిగిలిందని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు