నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కరీంనగర్ మాజీ ఎంపీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ( Mustabad mandal )లో మండలంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన అకాల వడగండ్ల వానకు ముస్తాబాద్ ,.

పోతుగల్,.

గన్నెవారిపల్లె ,.సేవలల్ తండా,.గ్రామాలలో వడగండ్ల వాన కు నష్టపోయిన పంట పొలాలను మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్( B Vinod Kumar ) తో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు కలిసి వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.

ఈ క్రమంలో రైతులు బోరున వినిపిస్తూ తమ ఆవేదన వ్యక్తం వినోద్ కుమార్ , నేతలకు తెలిపారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించాలని కోరుతామని రైతులకు తెలిపారు.

రైతులు అప్పుచేసి పంటలే ఎండిపోయి నూతన బోర్లు వేసి చేతి కందే పంట ఆకాల వర్షం ద్వారా పూర్తిగా నష్టపోయామని తెలిపారు.అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు పుష్కలంగా సాగు నీటిని విడుదల చేసి పంటలు సమృద్ధిగా పండే విధంగా చూశాయని ,ప్రస్తుత ప్రభుత్వం పంటకు సాగునీరు ఇవ్వక ఒకవైపు కొంత మేరకు ఎండిపోయిన సందర్భంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వడగండ్లు వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

గత ప్రభుత్వం కాలేశ్వరం( Kaleshwaram ) నీరు అందించిందని రైతులు తెలపడం దీనికి నిదర్శమని రైతులు ఆధైర్య పడవద్దని ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అందజేయాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 15 వేలు నుండి 20వేల వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు ఎంపీపీ జనగామ శరత్ రావు, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్,మాజీ టిఎస్పిఎస్సి సభ్యులు ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, సర్వర్ పాషా, కార్యకర్తలు నాయకులు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News