హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ పీసీసీ సమావేశంలో మాజీమంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్టీకి నష్టం కలిగేలా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ క్రమంలో కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలిపారు.ఈ నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలు వద్దంటూ కొండా సురేఖను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సముదాయించినట్లు తెలుస్తోంది.
ఫిర్యాదులు ఏమైనా ఉంటే రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు చెప్పాలని సూచించారు.