మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగు రాష్ట్రాల్లో దివంగత నేత ఎన్టీఆర్ పేరును స్మరిస్తూనే ఉన్నారని తెలిపారు.

ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ సిద్ధాంతాలను టీడీపీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.

పేదల కోసం పెట్టిన టీడీపీని వ్యాపార సంస్థగా చేశారన్నారు.టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబని తెలిపారు.

ఎన్టీఆర్ పై చెప్పులతో ఎందుకు దాడి చేయించారో చెప్పాలని నిలదీశారు.ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయన్న కొడాలి అదే చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తొస్తుందని వెల్లడించారు.

Advertisement

చంద్రబాబులా జగన్ అవకాశవాద రాజకీయాలు చేయరని తెలిపారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు