సీఎం జగన్ పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్..

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పై షర్మిల ( Sharmila )చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం పాకులాడడం సరికాదు.

 Former Minister Kodali Nani Fired On Sharmila's Comments On Cm Jagan, Sharmila,-TeluguStop.com

పదిమంది పనికిమాలిన వెధవల్ని వేసుకొని రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల….ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తుంది.

రాష్ట్రంలో ఏం జరగాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిల….కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదు.

ఎంపీగా కూడా గెలుస్తాడో తెలియని రాహుల్ గాంధీ ( Rahul Gandhi )రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు.

జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిల పార్టీ, ఒక శాతం పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ తో కలిస్తే ఏం జరుగుతుంది.

రాజకీయ లబ్ధి కోసమే జగన్( CM ys jagan ) పై,షర్మిల నిందలు వేస్తుంది.షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా.ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించిందా….2019 ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా.గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా.రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుంది.ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వం పై నిందలు వేయడం దారుణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube