కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Former Minister Jagadish Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పదవి నిలబెట్టుకోవడానికి ఒకరు, పదవి కోసం మరొకరు పాకులాడుతున్నారని మండిపడ్డారు.

 Former Minister Jagadish Reddy Fire On Komati Reddy Brothers, Komati Reddy Broth-TeluguStop.com

గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మరిచిపోయారా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.ఇప్పుడు పోటీ పడి రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బ్రదర్స్ పొగుడుతున్నారని విమర్శించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్( Komatireddy Brothers ) చీటర్స్, రాజకీయ విలువలు లేవని ఎద్దేవా చేశారు.ఏదో ఒక రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.

రేవంత్ రెడ్డి లిల్లీపుట్ అందులో సందేహం లేదని పేర్కొన్నారు.కేసీఆర్ అనుభవం, కమిట్ మెంట్ ముందు మీరంతా లిల్లీపుట్స్ అంటూ ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే జీవిత కాలం వెతికినా కేసీఆర్ ను ఏమీ చేయలేరని వెల్లడించారు.ఎంపీ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బీజేపీలోకి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కు ఐదేళ్లు సీఎంలను కొనసాగించే అలవాటు లేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube