ఏ ఏ శాఖ లో అవినీతి అధికంగా ఉందో ఆయా శాఖల్లో సాంకేతికతను మరింత పెంపొందించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ప్రభుత్వ శాఖల్లో అవినీతి పై నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను ఆయన విడుదల చేశారు.
ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన శాఖల్లోనే అధికంగా అవినీతి ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయని చెప్పారు.ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడైందని అన్నారు.
సమాజం కృంగి పోవడానికి పథకాలు సరిగ్గా అమలు కాకపోవడానికి అవినీతే కారణమని అన్నారు.
టెర్రరిజం కన్నా దేశానికి ప్రమాదకరం అవినీతేనని ప్రధాని మాట్లాడిన సమయంలో అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తమ పనులు పూర్తయితే చాలు అన్న దృక్పథంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తున్నారని అన్నారు.
ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
అదే విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల్లో తక్షణమే శిక్షలు ఖరారు అయితే మిగిలిన వారు భయపడి జాగ్రత్తగా ఉంటారని అన్నారు.లంచం ఇస్తేనే పని అవుతుందన్న భవనం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీకి, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అయితే సీబీఐకు ఫిర్యాదు చేయాలన్న అవగాహన ప్రతి పౌరుడికి కల్పించాల్సి ఉందన్నారు.
రెవిన్యూ లో 85 శాతం వరకు అవినీతి జరుగుతున్నట్లు, పోలీస్ శాఖలో 79 రాజకీయ నాయకులు 100% అవినీతికి పాల్పడుతున్నట్లు తమ సర్వే రిపోర్టు ద్వారా తెలిసిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపకుడు రాజేందర్ తెలిపారు.