ఏడుకోండల స్వామి వారి( sri venkateswara swamy )ని దర్శించుకోవడం నా అదృష్టం.ఇప్పటికే సీజన్ దాటుతున్నా వేరుశనగ విత్తనాలు చేసుకునేందుకు వరుణ దేవుడు కరుణించాలి.
రైతాంతం, వ్యవసాయం బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.వర్షం బాగా పడి తొందరగా వ్యవసాయ పనులు ప్రారంభించే విధంగా ఆశీర్వాదించాలని కోరా.
పది సంవత్సరాల ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎటువంటి హామీలు నేరవేర్చలేదు.
దేశంలో, రాష్ట్రంలో ప్రజలంతా మార్పును కోరుతున్నారు.
దేశంలో, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వస్తుంది.ఏపిలోని ప్రజలు మార్పు కోరుకుంటే ఇక్కడ కూడా మర్పులు జరిగే అవకాశం ఉంది.
అనేక అంశాలను తెలంగాణ ప్రభుత్వం నేరవేర్చలేనిపక్షంలో ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు.కర్ణాటక రాష్ట్రం( Karnataka State )లో కాంగ్రెస్ గెలుపుతో ప్రజల్లో మరింత ఊపు వచ్చింది.
దేశంలో అన్ని పార్టిలు ప్రజాస్వామ్యంను కాపాడాలంటే నరేంద్ర మోదీని గద్దే దించాలని భావిస్తున్నారు.







