తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ నీ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు ఖండిస్తూ ఉన్నారు.ప్రముఖంగా ఇండియా కూటమి నేతల మద్దతు లభిస్తూ ఉంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు.ఇలా ఉంటే తాజాగా చంద్రబాబు అరెస్టు పట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి( Kumaraswamy ) స్పందించారు.
చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు.ఇదే సమయంలో నారా లోకేష్ కి కుమారస్వామి ఫోన్ చేయడం జరిగింది.
ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని.పోరాటాన్ని ఆపవద్దని ఎప్పటిలాగే కొనసాగించాలని లోకేష్( Lokesh ) కి కుమారస్వామి సూచించారు.కచ్చితంగా న్యాయస్థానంలో చంద్రబాబుకి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.చంద్రబాబు అరెస్ట్ పట్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
హరీష్ రావు, కేటీఆర్( Harish Rao, KTR ) లతో పాటు బీఆర్ఎస్ నేతలు స్పందించడం జరిగింది.మరోపక్క చంద్రబాబు అరెస్టు పట్ల టీడీపీ సానుభూతిపరులు ట్విట్టర్ లో #IAmWithBabu అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు.







