ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసెందుకు అసెంబ్లీకి చేరుకున్నారు మాజి ముఖ్యమంత్రి కేసిఅర్. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో, చేతిలో కర్ర పట్టుకొని గురువారం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు.
ఆయనతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు హాజరయ్యారు.కాగా, కాసేపట్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు.కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు.అసెంబ్లీకి కొత్త గెటప్ కొత్త కారులో చేతిలో కర్రతో కేసిఅర్.