బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్( Former MLA Shakeel ) కుమారుడు రహెల్( Rahel ) ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.ప్రజాభవన్ ఎదుట ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రహెల్ ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో రహెల్ కు న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించారు.కాగా రహెల్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో( Shamshabad Airport ) ఉండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యాక్సిడెంట్ తరువాత దుబాయ్ కి పారిపోయిన రహెల్ నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నాడు.తాజాగా హైదరాబాద్ కు వస్తున్నాడన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆయనను అరెస్ట్ చేశారు.
జడ్జి ఆదేశాల మేరకు రహెల్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.