బీజేపీ కి ' రావెల్ ' బై బై ! కారణం ఏంటంటే ?

2024 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు దూసుకు వెళ్తున్న బీజేపీ.చేరికలపై ఎక్కువ దృష్టి సారించింది.

పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకుని బలమైన పార్టీగా మారాలని చూస్తోంది.జనసేన పార్టీ సహకారంతో అధికారంలోకి రావచ్చని కలలు కంటోంది.

దీనికి అనుగుణంగానే అనేక రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ వస్తోంది.ఇదిలా ఉంటే.

బీజేపీలో చేరికలు అటుంచి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి చేరాలనుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బిజెపికి రాజీనామా చేశారు .ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు ఆయన లేఖ రాశారు.ఇప్పటి వరకు పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.

Advertisement

తాను వ్యక్తిగత కారణాలతోనే బిజెపిలో కొనసాగలేక పోతున్నానని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు.        అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

అది కూడా ఈ నెల 27,  28 తేదీల్లో ఒంగోలులో జరిగే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టిడిపి కండువా కప్పుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.రావెల కిషోర్ బాబు  2014 ఎన్నికల ముందు వరకు ఐఆర్ టీఎస్ అధికారిగా పని చేశారు.2014 ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.మంత్రివర్గంలోనూ చంద్రబాబు స్థానం కల్పించారు.

ఆ తరువాత పరిణామాల క్రమంలో రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తడం.ఆయన కుమారుడు వ్యవహారం వివాదాస్పదం అవ్వడం తదితర కారణాలతో మంత్రివర్గం నుంచి తొలగించారు.   

   దీంతో 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో కిషోర్ బాబు చేరారు .అక్కడ ఆయనకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో,  ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.ఇప్పుడు టిడిపిలో చేరే ఆలోచనతో బిజెపికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు